సాంప్రదాయ బంగారు పతకాన్ని తగిలించిన జూట్ నెక్లెస్ లు, హారాలు గ్రాండ్ లుక్ ఇస్తాయి. సాంప్రదాయ చీరె కట్టు కైనా, వెస్ట్రన్ డ్రెస్ కైనా ఈ జనపనార ఆభరణం అందంగా అమరిపోతుంది. విడిగా నారతో చేసిన గొలుసు లకు పెద్ద పెండెంట్లు జతచేసి అందమైన నగలు తయారవుతున్నాయి. లక్ష్మీ రూపాల దగ్గర నుంచి సిల్వర్, కలపతో చేసిన పెద్ద పెండెంట్లు జతచేసిన రంగుల జనపనార హారాలు ఇప్పటి ట్రెండ్. రంగురంగులుగా వేసుకునే దుస్తుల పైకి ఈ తరహా ఫ్యూజన్ జువెలరీ చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది.

Leave a comment