ఇసుక సిమెంట్ తో , ఇటుక రాళ్ళతో ఇళ్ళు కడతారు. అదే పల్లెటూర్ల లో మట్టి సున్నపు రాయితో ఇళ్ళు పూర్తవుతాయి . పర్యావరణ హితంగా చిస్మన్ అనే అమ్మాయి గ్రీన్ వుడ్ తయారు చేసి ఇంటి నిర్మాణాలు తేలిక చేసింది . ఈ గ్రీన్ వుడ్ ను చిస్మన్ ఊక తో తయారుచేసింది . చండీఘర్ కి చెందిన చిస్మన్ ఊక పొయ్యి వెలిగించి వంట చేయడం అందులొంచి వచ్చే పొడ గమనించింది . చదువు పూర్తయిన తర్వాత ఊక పైన పరిశోధన చేసి ఊక కి మరికొన్ని జిగురు పదార్దాలు కలపి గ్రీన్ ఉడ్ ను తయారు చేసింది . ఈ పలకలు చాలా గట్టిగా ఉంటాయి . వాటితో ఇళ్ళను నిర్మించుకోవచ్చు . ఈ ఆవిష్కరణ చిస్మన్ కు ఎన్నో సత్కారాలు తెచ్చిపెట్టాయి .

Leave a comment