తమిళనాడులోని కుంభకోణంలో ఉండే రోహిణిని బుల్లెట్ రాణి అని పిలుస్తారు. వాళ్ళ నాన్న కవి 20 ఏళ్ళుగా మెకానిక్ షెడ్ నిర్వహిస్తున్నాడు. ఆయనకు నలుగురు కూతుళ్ళలో చివరి అమ్మాయి రోహిణి. తండ్రికి సాయంగా షెఢ్ లో ఉండి పని నేర్చుకుంటుంది. స్కూటీ, యమహా ,బుల్లెట్, హర్లీ డేవిడ్ సన్ వరకు ఏ వాహన సమస్య అయినా నిమిషంలో కనిపెట్టేసి బాగు చేయగలదు. బాగు చేసి సవ్యంగా వినియోగదారుల ఇళ్ళకి చేర్చి సర్వీస్ భళా అనిపించుకొంటుంది.

Leave a comment