Categories
ఫిదా,ప్రేమమ్,ఎమ్ సీఎ వంటి చాల కొద్ది సినిమాల్లోనే కనపడిన సాయిపల్లవికి స్టార్ హీరోయిన్ బిరుదు దక్కేసింది. జార్జీయా లో మెడిసిన్ పూర్తి చేసిన ఈ విద్యాధికురాలు తనని తీర్చిదిద్దింది దర్శకులే అంటుంది. సినిమాల్లో ఒక నిమిషం కనబడే పాత్ర వేసిన ఫ్యూచర్ లో కథనాయిక అవ్వాలనుకుంది సాయిపల్లవి. చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. కేరీర్ లో దూసుకుపోతున్న సాయిపల్లవికి హర్రర్ సినిమాలు అంటే భయమంటుంది. చదువుకొనేటప్పుడు కన్జ్యూరింగ్ ఇంగ్లీష్ సినిమాను సౌండ్ ప్రూఫ్ లో చూస్తూ హనుమాన్ చాలీసా వల్లించుకుంటు చూశా. కాని ఇప్పుడు కణం అనే హర్రర్ మూవీలో నటించడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. సినిమా పూర్తయ్యేసరికి నా భయం పోతుందేమో అంటుంది సాయిపల్లవి.