మనం భోజనం చేయడం ఆ టైమింగ్లో వండుకునే వంటలు ఎప్పుడో అనాధి కాలం నుంచి కొద్దికొద్ది మార్పులతో వస్తూ ఉన్నాయి.  అప్పుడేప్పుడో భారీ భోజనాలు, అరిసెలు, లడ్డులు, చక్కిలాలు స్నాక్స్ ఆరోజులు పోయాయి.  స్లిమ్ వంటలు వచ్చాయి.  బూరె ముక్క చేతిలో పెడితే అమ్మయిలు డైటింగ్ అంటారు.  ఇప్పుడు కుడా వంటల విషయంలో కొత్త పద్దతులు వచ్చేస్తున్నాయి.  ఉల్లి, క్యారెట్, ముల్లంగి, పుచ్చకాయలు కొని కొంత భాగం వండుతారు, కొంత పనికిరాదని తీసేస్తారు.  అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు మనం వదిలేసిన కాడలు, ఆకులు,తొక్కలతో రూట్ టు స్టీమ్ ఈటింగ్ పద్దతి వచ్చేస్తుంది, వేళ్ళ నుంచి ఏ భాగం వృధా కాకుండ కొత్త వంటల సృష్టి.  రెస్టారెట్ల మెనులోకి ఈ రూట్ టూ స్టీమ్ ఈటింగ్ వినూత్నమైన ఆకర్షణ అవ్వబోతుంది.

Leave a comment