ఉత్తరాదిలో ఇటు దక్షిణాదిలో మహిళా దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయవంతం అవుతున్నాయి. 45 ఏళ్ళ మేఘన గుల్జార్ హిందీ పాటల రచయిత గుల్జార్ హీరోయిన్ రాభీల ఏకైక కుమార్తె. గత 20 సంవత్సరాలలో ఆరు సినిమాలు తీశారు. ఈ సంవత్సరం వచ్చిన రాజి సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆలియా భట్ రా గూఢచారిగా నటించిన ఈ సినిమా 200కోట్ల కలక్షన్లు సాధించింది. ఆరుషి తల్వార్ హత్య కేసు నేపథ్యంలో 2015లో ఈమె తీసిన తల్వార్ సినిమాలకు మంచి గుర్తింపు వచ్చింది. తనను డైరక్టర్ గానే చూడాలని మహిళా డైరక్టర్ గా చూడద్దనీ చెపుతుంది మేఘనా గుల్జార్.

Leave a comment