2018 సంవత్సరానికి గానూ చుంబక్ సంస్థను స్థాపించిన శుభ్రా చద్దీ ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ పవర్ ట్రయల్ బ్లేజర్స్ లిస్ట్ లో స్థానం సంపాదించుకొన్నారు. భర్త వివేక్ ప్రభాకర్ తో కలిసి 2010లో ఈ సంస్థ ప్రారంభించారు. బెంగళూరులో ఉన్న చుంబక్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఇప్పుడు పదకొండు నగరాల్లో ఇరవై శాఖలకు విస్తరించింది. చుంబక్ సంస్థ తయారు చేసే కుషన్లు చాలా ప్రత్యేకం. ఇవి దిండులాగా కనిపించవు ఆటోలో ,స్కూటర్ లో ,బస్ లో ,గుర్రాలు, గంగి రెద్దులు,గుడ్ల గూబలు వంటి బొమ్మల్లాగా చేసిన కుషన్లను సోఫాల్లో పిల్లల మంచాలపైన చాలా బావుంటాయి. పిల్లలు ఈ దిళ్ళను అస్సలు వదిలిపెట్టరు కూడా.

Leave a comment