ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ స్కూల్ పిల్లల కోసం రూపొందించిన యూనిఫామ్ సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతోంది రాజస్థాన్ లోని  జైసల్మేర్‌లో రాజ్‌కుమారి రత్నావతి బాలికల పాఠశాల ఉంది. ఇందులో 400 మంది బాలికలు చదువుకుంటున్నారు.సిట్టా సంస్థ భారతదేశంలోని పేదల విద్య, ఆరోగ్యం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పనిచేస్తుంది. ఈ సిట్టా సహకారంతో డిజైనర్ సబ్యసాచి అజ్రఖ్‌ ప్రింట్‌ ఉన్న యూనిఫామ్ రూపొందించారు మోకాలి పొడవున ఏకరీతిగా ఉండే ఫ్రాక్‌. గుండ్రటి మెడ, త్రీ క్వార్టర్‌ స్లీవ్స్, మెరూన్‌ స్లగ్స్‌తో ఉన్న ఈ యూనిఫామ్‌ చాలా అందంగా ఉంది.మేలిమి చేనేత పైన సేంద్రీయ రంగులతో బ్లాక్ ప్రింట్ ఉన్న ఈ యూనిఫామ్స్ గురించిన ఆడపిల్లల ఛాయాచిత్రాలు ఇన్ స్టాగ్రామ్ పేజీల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి .

Leave a comment