అమెరికన్ పాప్ స్టార్,హాలివుడ్ నటి సెలీనా గోమెజ్ ఇప్పుడు సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నా అంటుంది.అనారోగ్యం తో మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చిన సెలీనా అనుభవం వింటే సోషల్ మిడియాను తలచుకుంటే నిజంగా భయపడాలి.ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఫాలోయర్లకు లెక్కే లేదు.లూపస్ కి గురై శస్త్ర చికిత్స తర్వాత కాస్త కోలుకుని అనారోగ్యంతో ఉండి కూడా సోషల్ మీడియాను వదలలేకపోయా.సోషల్ మీడియా ఎడిక్షన్ తో ఆమె రెండు సార్లు రిహాబిలేషన్ సెంటర్లో చేరింది.ఉదయం లేచిన దగ్గర నుంచి ఫోటోలు అప్ లోడ్ చేస్తూ అదే నా పాలిట శాపంగా మారింది.ఎంతో ఒత్తిడి పెరిగిపోయి ఇప్పుడు 95 డిగ్రీల వేడిలో వ్యాయామాలు చేస్తున్న ఇక సోషల్ మీడియాను దగ్గరకు రానివ్వను అంటుంది సెలీనా.

Leave a comment