వేసవికి మల్లె పూవులు ఎంత ప్రత్యేకమో పువ్వుల ప్రింట్లున్న డ్రెస్ లు అంతే ప్రత్యేకం . సాయంత్రం పార్టీకైనా ,వేడి ఎండలల్లో ఆఫీస్కైనా కొత్త డిజైన్లు ,సరికొత్త రంగుల్లో పువుల ప్రింట్లు అన్ని వయసుల వారికీ నప్పుతాయి. ముదురు ,పసుపు, బంగారు రంగు గులాబీ నారింజ రంగులు ఈ సీజన్ లో చక్కగా ఉంటాయి. వీటిలో లేత వర్ణాలు శరీరానికి చల్లదనం ఇస్తాయి. ఈ పేస్టల్ కలర్స్ కాస్త బొద్దుగా ఉన్నవారికి అందాన్నిస్తాయి. పేస్టల్ కలర్ కుర్తీ టాప్ ఎంచుకొని దానికి జతగా ముదురు రంగు జీన్స్ లెగ్గింగ్స్ స్కర్ట్ లు చక్కగా ఉటాయి. అలాగే ఈ పేస్టల్ కలర్ కి పూల ప్రింట్లు సరిగ్గా సరిపోతాయి. ఫ్లోరల్ ప్రింట్లు అనార్కలీలు స్కర్టులు ఈ సీజన్ కి బెస్ట్ సెలక్షన్ .ఇవి పార్టీ వేర్ గానూ బావుంటాయి. ఈ తరహ దుస్తులకు పెద్ద ఆభరణాలు అక్కేర్లేదు. పోడవాటి జంకులు స్టర్ట్స్ వంటివి ధరిస్తే సరిపోతుంది.

Leave a comment