ఆహారంలో పిండి పదార్ధాలు కాస్త తగ్గించి ,కూరగాయాలు ,తృణధాన్యాలు వంటివి తింటే ఆరోగ్యానికి మంచిదని అమెరికాలో జరిపిన ఓ అధ్యయనం చెబుతోంది. 15వేల 400 మంది ఆహారపు అలవాట్ల పై జరిపిన ఆన్ లైన్ సర్వేలతో ఆహారంలో మోస్తారుగా కార్బోహైడ్రేట్స్ తీసేకొంటే మాంసాహారం తీసుకోన్న వారికంటే ఆరోగ్యంగా ఉన్నట్లు రుజువైంది. వీరిలో మరణ అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఈ అధ్యయనంలో పిండి పదార్థాలు తీసుకోవటం వల్ల ఆయుర్దాయం నాలుగేళ్ళకు పైగా పెరిగినట్లు తేలింది.ప్రోటీన్, ఫ్యాట్ ,ఆరోగ్యవంతమైన కూరగాయాలు తీసుకోంటే వాళ్ల బరువు తక్కువగా కూడా ఉన్నట్లు అధ్యయనకారులు గుర్తించారు.

Leave a comment