Categories
జుట్టు చక్కగా ఉండాలంటే రసాయనాలతో కూడిన ఆయిల్స్ కంటే ప్రకృతి వర ప్రసాదా లైన ఏడు మూలికలు ఉపయోగించుకోమంటున్నారు ఆయుర్వేద వైద్యులు. సహజసిద్దమైన రోగనాశిని వేప,భారతీయ జిన్ సెంగ్ అని పిలిచే అశ్వగంధ,సి విటమిన్ పుష్కలంగా లభించే ఉసిరి ,యాంటీ సెప్టిక్ లక్షణాలున్న ఆ బంతిపూలు ,యాంటీ ఇన్ ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్న మెంతులు,ఉసిరి,కరక్కాయ మిశ్రమమైన త్రిఫల చూర్ణం అధ్భుతమైన ఔషధ లక్షణాలున్న తులసి ఇవన్ని జుట్టుకు ఆరోగ్యం ఇచ్చేవి. చర్మ సౌందర్యం కేశ సౌందర్యం కోసం ఈ ఏడింటినీ ఉపయోగించుకోవచ్చు. క్యాన్సర్ లో ,ఫేస్ ఫ్యాక్ ల్లో వీటిని కలిపి కూడా ఉపయోగించవచ్చు. కేశసంరక్షణ కోసం వాడే ప్రతి ఆయిల్ లోనూ ఉసిరిని తప్పని సరిగా ఉపయోగిస్తారు.