Categories
బిర్యానీలు ,సలాడ్లు అన్నీ రకాల వంటల్లోనూ ఇప్పుడు పుట్టగొడుల్ని చేరుస్తున్నారు. బోలెడన్నీ ప్రోటీన్స్ లైసెన్, ట్రిస్టోఫోన్ వంటి అమైనో ఆమ్లాలు వీటిలో ఉంటాయి. కాశ్మీర్ కొండల్లో దొరికే గుచి అనే పుట్ట గొడుగులు ప్రపంచంలో కెల్లా ఖరీదు. కిలో పదివేల నుంచి 30 వేల వరకు ఉంటాయి. వీటిని రాయల్ మష్రూమ్స్ అంటారు. తేనే తోట్టేలాగా ఉంటాయి చూసేందుకు. కృత్రిమ వాతావరణంలో వీటిని పెంచటం చాలా కష్టం. వీటి రుచి చాలా బావుంటుంది. ఎండబెట్టినవి నాననిచ్చి ఉడికిస్తారు. ఈ రాయల్ మష్రూమ్స్ ఉదరకాళవ్యాధులకు మంచి మందు.