Categories
గంటల కొద్దీ సమయం గడిపేది ఇప్పుడు కంప్యూటర్ ముందే ఉండటం స్క్రీన్ వైపు చూస్తూ పని చేస్తూ ఉండటం తప్పని సరి అయ్యాయి. అదే పనిగా కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ ఉంటే కళ్ళు పొడిబారి పోవటం ,కంటిచూపు తగ్గే ప్రమాదం అధికం అందుకే ప్రతి అరగంటకు లేదా గంటకోసారి అయినా ఐదునిమిషాలు కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. ఈ విశ్రాంతి సమయంలో కళ్ళు మూసుకొని కాసేపు అలా ఉన్నా పర్లేదు. దీనివల్ల మెదడుకు విశ్రాంతి .అలాగే సరిగ్గా కూర్చోకపోతే అంటే హర్మోన్ పోశ్చర్ సరిగ్గా లేకపోతే వెన్ను నడుమునొప్పి తప్పదు. కంప్యూటర్ పైన సరైన వెలుగు పడకపోయినా ఇబ్బంది. రిలాక్స్ గా జారి కూర్చుని పని చేయటం మాటుకు వీపు నొప్పి సమస్య తెచ్చి పెట్టటం ఖాయం.