చాలా కాలంగా మనదేశంతో పాటు ఆస్ట్రేలియ,జపాన్,తైవాన్,ఇండోనేషియా,దక్షణ కొరియా, జాంబియా వంటి దేశాల్లో మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నారు. కొన్ని సంస్థలో ప్రతి నెల మహిళలకు వేతనం తో కూడిన సెలవులు ఇస్తున్నారు. ముంబయ్,కోల్ కతా కు చెందిన కొన్ని కంపెనీలు నెలకో సెలవు ప్రత్యేకంగా ఇస్తున్నాయి కూడా నెలసరి సమయంలో కడుపునొప్పి,వికారంతో,లేదా ఇతర సమస్యలతో భాదా పడే వారికోసం ఈ అవకాశం ఇస్తున్నారు. జపాన్ లో 1947 లోనే నెలసరి సెలవు విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం నెలసరి నొప్పితో బాధపడే మహిళలు ఈ సెలవు ఉపయోగిచుకొంటున్నారు. ఇండోనేషియా లో కూడా మహిళలు నెలసరి కి రెండు రోజులు సెలవు తీసుకొనే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ప్రపంచ వ్యాప్తంగా కల్పించాలని ఎంతో మంది ఎక్సపర్ట్స్ సూచిస్తున్నారు.

Leave a comment