ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ లాక్ డౌన్ సమయాన్ని ఫేస్ మాస్క్ ల తయారీ కోసం వినియోగిస్తున్నారు. వాటిని ఉచితంగా సరఫరా చేయటం పేదలకు స్వల్ప ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ముంబయ్ కు చెందిన అనితా డోంగ్రే ఫౌండేషన్స్ టైలరింగ్ యూనిట్లలో 24 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. చారోటీ, ధనేవారీ ప్రాంతంలో ఉండే ఈ మహిళలకు ఉపాధీ కోసం,ప్రొటెక్టివ్ మాస్క్ ల తయారీ లో మునిగి పోయారు  అనితా డోంగ్రే. వీటితో పాటు ప్రత్యేకంగా తయారీ చేస్తున్న డిస్పోజబుల్ మాస్క్ లు ఎన్ జిఓ లకు,గ్రామీణులకు,ఆస్పత్రి సిబ్బందికీ ఉచితంగా ఇస్తున్నారు. వీటికి ఉపయోగించే మెటీరియల్ అనితా తన ఫ్యాషన్ దుస్తులు కుట్టేందుకు తెచ్చిందే.

Leave a comment