Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/12/punching-bag-workout-5ac0441c875db90037b1c01a.jpg)
కోపాన్ని,ఉద్రేకాన్నితగ్గించే ఎక్సర్ సైజులు కూడా ఉన్నాయి. రెసిస్టెన్స్ బ్యాండ్స్ ని చేతికి తగిలించుకుని స్ట్రెచ్ చేయడం ద్వారా ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి. అలాగే బాక్సింగ్ ప్యాడ్ పై పంఛ్ లు విసరడం ద్వారా ఒత్తిడి పెంచే ఆలోచనలు బాధలు,కోపం పొగొట్టుకోవచ్చు. ఇక బరువులు ఎత్తితే మానసిక ఆహ్లాదం చ్చే టెస్టో స్టిరాన్ హార్మోన్ విడుదలవుతుంది.రబ్బర్ మెడిసన్ బాల్ ని గోడకు కొంచెం దూరంగా నిలబడి బంతిని విసురుతూ క్యాచ్ పడితే ఉద్రేకం తగ్గిపోతుంది. ఇక అన్నింటికంటె విలువైనది పాటలు వింటూ డ్యాన్స్ చేయడం. మనసుకు ఇష్టమైన పాటలు స్వాంతన డ్యాన్స్ లో ఉత్సహాం ఏదైనా సంతోషం మన మనసులో నుంచి రావాలి. మరవకండి