Categories
WhatsApp

కోట్ల బిజినెస్ చేస్తున్న ప్లస్ సైజ్ మార్కెట్.

ప్లస్ ఫ్యాషన్ మార్కెట్ ఇప్పుడు వేల కోట్ల రూపాయిల్లో నడుస్తుంది. ఒకప్పుడు ఫ్యాషన్ అంటే జీరో సైజ్ వాళ్ళకే రాంప్ వాక్ లు వాళ్ళకే ఆన్ లైన్ మార్కెట్ వాళ్ళదే. ఇప్పుడు రోజులు మారిపోయాయి. బొద్దుగా వుండటంలో ఓ ఫ్యాషనుంది అంటూ గత సంవత్సరం ఒక ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ షో నిర్వహించింది. రాంప్ వాక్ చేయ బోయే బొద్దుగా వున్న అమ్మాయిల కోసం దేశ వ్యాప్తంగా ఆడిషన్లు నిర్వహించారు. లక్కి ఫ్యాషన్ వాక్ లో జరిగిన ప్లస్ సైజు ఫ్యాషన్ షో కు మంచి స్పందన వచ్చింది. అస్సలు ఎక్కువ మంది ప్లస్ సైజు వాళ్ళున్న దేశాల్లో భారత దేశంలో మూడో స్ధానంలో వుంది. మరింక కష్టం ఏముంది. ఇక ఆన్ లైన్ స్టోర్స్ లో బొద్దుగా వుందేవల్ల కోసం లెగ్గింగ్స్ , జేగ్గింగ్స్, దేనిమ్స్, బ్లేజర్స్, షార్ట్స్, ట్రౌజర్స్, ఫ్రాక్స్ ఇలా రకరకాల డ్రెస్ లు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నో ఫ్యాషన్ పోర్టల్స్ ప్లస్ సైజుకు అవకాశం ఇస్తున్నాయి. ఇప్పుడిక ప్లస్ సైజ్ ఫ్యాషన్ హవా నడుస్తుంది.

Leave a comment