Categories
శీతల్ దేవి భారతీయ పారా ఆర్చర్ వైకల్యం శరీరానికే గాని మెదడుకు లేదని నిరూపించారామె. చేతులు లేని ఈ విలువిద్య క్రీడాకారిణి 2024 సమ్మర్ పారా ఒలంపిక్స్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పటమే కాకుండా కాంస్య పథకం గెలుచుకుంది. అతి సామాన్య కుటుంబానికి చెందిన శీతల్ దేవి భారత సైన్యం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె ప్రపంచపు అద్భుతమైన కోచ్ ల దృష్టిలో పడింది. కాళ్ళను ఉపయోగించి ఆమె విలువిద్యలో శిక్షణ తీసుకుంది. ఎన్నో కష్టాలు భరించి ప్రపంచ రికార్డు సాధించింది.దివ్యాంగులకే కాదు కోట్లాది యువతకు స్ఫూర్తిగా నిలిచింది.