మీటూ ఉద్యమం ఊపందుకుంది. పదేళ్ళ కిత్రం తన మాజీ ప్రియుడు నిర్మాత గౌరంగ్ దోషి నన్ను దురుసుగా కొట్టాడని ఆ తాలూకు ఫోటోలు అప్పటి తన దెబ్బలతో వాచిపోయినా మొహాన్ని చూపిస్తూ పోస్ట్ చేసింది నటి ఆషా షైనీ. నువ్వు నాకు నచ్చావ్ , నరసింహ నాయుడు వంటి చిత్రాల్లో ప్రేక్షకులకు ఆమె పరిచయస్తురాలే.ఆయన్ను నేనెంతో ప్రేమించాను .2007 ప్రేమికుల దినం రోజున ఆయన నన్ను దవడ ఫ్రాక్చర్ అయ్యోలా కొట్టాడు.అప్పట్లో నేను ఈ విషయం చెప్పినా ఎవ్వరు నమ్మే వాళ్ళు కాదు. గౌరంగ్ కు చాలా పలుకుబడి ఉండేది. నాకు సినిమా అవకాశాలు రానివ్వనని బెదిరించాడు. అన్నట్లుగానే నాకు అవకాశాలు రాలేదు. సినిమాలకు తీసుకొన్నట్లే తీసుకొని తొలగించేవారు.ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని మీటూ తో అందరూ వాళ్ళ విషయాలు షేర్ చేయటం మొదలు పెట్టాక నేను నా అనుభవం గురించి చెప్పాను.నిజాన్ని చెప్పకొందాం మనల్ని మనం కాపాడుకొందాం .ఎవరికి ఎవరు తలవంచ వద్దు. మీరు వంటరి వాళ్లు కాదు అని పోస్ట్ చేసింది ఫ్లోరా షైనా.
Categories