ఎంతో శ్రద్దగా ఉంటాం గానీ ఇంట్లో ఎదో ఒక మూల సుక్ష్మ జీవులు పోంచె వుంటాయి. బాత్ రూమ్స్, డ్రాయింగ్ రూమ్స్ వళ్ళు వంచి శుబ్రం చేస్తాం గానీ అసలైన ప్రమాదం వంటింట్లో పంచి వుంటుందని మరచి పోతాం. వంటింట్లో ఉపయోగించే హ్యాండ్ టవల్ లో కిచెన్ టవల్స్ లో సుక్ష్మ క్రీములు ఎక్కువగా వుంటాయింటారు ఎక్స్ పార్ట్స్. చేతులు శుబ్రంగా ఉంచాలి. మురికిగా వుండే టవల్స్ సుక్ష్మ జీవులకు ఆవాసం కనుక ప్రతి రోజు పని పూర్తి అయ్యాం హ్యాండ్ టవల్స్ డైనింగ్ టేబుల్ దగ్గర వాడే నాప్ కిన్స్ వాష్ చేసేయాలి. ఒకటికి రెండు సెట్లు అందుబాటులో వుంచుకోవాలి. వంటగదిలో బాత్ రూమ్ లో వాడె హ్యాండ్ టవల్స్ లో కోలీ ఫార్మ బాక్టీరియా వుంటుంది. రెండు రోజులకు ఒక సారి మరుగుతున్నా నీళ్ళలో పడేసి ఉడకనిచ్చి ఎండలో ఆరేసి వాడుకోవాలి.
Categories