Categories

టైమ్స్ మ్యాగజైన్ 2025 వ సంవత్సరానికి ప్రకటించిన విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ల జాబితాలో 13వ స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ పూర్ణిమా దేవి బర్మాన్. అంతరించిపోతున్న అరుదైన కొంగ జాతిని రక్షించడంలో పూర్ణిమ చేసిన కృషి అనన్యం. 2017 లో భారత ప్రభుత్వం ఆమెకు నారీ శక్తి పురస్కారం అందించింది అలాగే గ్రీన్ ఆస్కార్ గా పేర్కొనే పర్యావరణ అవార్డ్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు కూడా ఆమె అందుకున్నారు. ఆమె అస్సాం లో ఆరణ్యక్ అనే చోట సీనియర్ వైల్డ్ లైఫ్ జియాలజిస్ట్ గా పని చేశారు.