హెయిర్ స్టయిల్స్ లోనే ఫ్యాషన్ మొత్తం దాక్కుని వుంటుంది. అందమైన జుట్టు వుంటే దాన్ని అలంకరించే తీర్లేఎన్నో గాలికి వదిలేయిచ్చు. లేదా వంకీలు తిప్పచ్చు, రకరకాల జడలు అల్లచ్చు. కానీ అదే అందమైన కురులు రకరకాల రంగులు షేడ్స్ తో అమ్మాయిలను అలంకరించేస్తున్నాయి. జుట్టును రంగుల హరివిల్లుగా మార్చేసె సరికొత్త ట్రెండ్ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో సందడి చేస్తున్నాయి. అదే షైన్ లైన్ ట్రెండ్. అలా వదిలేసిన జుట్టు పైన లేజర్ ఎఫెక్ట్ తో రంగులు విరజిమ్మితే అనేకానేక వర్ణాలతో జుట్టు మెరిసిపోతుంది. ప్రకృతి లోని రంగులన్నీ అందమైన కురుల పైన వచ్చి వాలితే, అలాగే ఎన్నో షేడ్స్ తో బ్రౌన్, ఎరుపు, బూడిద రంగు ఇవన్నీ కలగలిసి జుట్టుకు మెరుపుల అందాల్ని తెచ్చి పెడుతున్నాయి. ఈ షైన్ లైన్ ట్రెండ్ ఓ సారి అంతర్జాలంలో వెతకండి.
Categories