పంచదార తగ్గించాలంటే స్ధిరనిశ్చయిం తో వుంటాం. తినకుండా చివరకు కాఫీలో కూడా మానేసి కాస్త నిబ్బరంతో ఫర్లేదు అనుకొంటామా, మనం నిర్భయంగా ఇందులో షుగర్ లేదు సుమా అని తీసుకునే కొన్ని పదార్ధాలలో షుగర దాక్కుని వుంది చూసుకోండి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. ఉదాహరణకు టొమాటో సాస్ లో మిగత ఇంగ్రీడియింట్స్ కంటే చక్కెరే ఎక్కువ. ఇందులో పులుపును తగ్గించేందుకు చక్కరే వాడుతారు. సలాడ్  ప్రిపరేషన్స్ లో వాడే రెడ్యుస్డ్ ఫ్యాట్ డ్రెస్సింగ్ లో చక్కర శతం చాలా ఎక్కువ. ఒక కప్పు రెడీమేడ్ బేక్డ్ బీన్స్ లో 20 గ్రాముల చక్కర వుంటుంది. రెడీ మేడ్ సిరీల్స్ లో చక్కర తప్పకుండా వుంటుంది. చాక్లెట్, ఇతర కోటింగ్స్ ద్వారా అదనంగా వుంటుంది. ఇతర కోటింగ్స్ ద్వారా అదనంగా ఒక్క బార్లో 20 గ్రాముల చక్కెర వుంటుంది.

Leave a comment