Categories
ఏ భాషలో అయినా అనర్గళంగా మాట్లాడాలను కొంటే ఆ భాష పైన పట్టు ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడాలను కొంటే గ్రామర్ నేర్చుకోవాలి. ఇప్పుడు లాక్ డౌన్ సమయం ఇంగ్లీష్ నేర్పే ఎన్నో యాప్ లు అందుబాటులో ఉన్నాయి. చదవటం,వినడం,మాట్లడటం,రాయటం,ఈ నాలుగు రకాల అభ్యాసాలు చేస్తేనే ఇంగ్లీష్ భాష పైన పట్టు సాధించేందుకు వీలవుతుంది. చక్కగా సమయం ఉంది కనుక,అమెజాన్,నెట్ ఫ్లిక్స్ లో వచ్చే ఎన్నో భాషల సినిమాలు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో ఉంటాయి. ఆ సినిమాలు చూస్తూ ఇంగ్లీష్ వేగంగా చదవటం ప్రాక్టీస్ చేయవచ్చు. గూగుల్ డార్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్,ఇన్ స్టాల్ చేసుకొని రోజుకో పేరాగ్రాఫ్ అయినా ఇంగ్లీష్ లో రాస్తే నెమ్మదిగా భాష పైన పట్టు సాధించవచ్చు.