లెహంగా ఎప్పటికీ మారని ఫ్యాషన్ లో ముందు వరుసలో ఉంటుంది. ఎన్నో వేడుకల్లో ఇండో వెస్ట్రన్ స్టయిల్ లో లెహంగా యువతను ఆకట్టుకుంటోంది. ప్లెయిన్ బెల్స్ స్లీవ్స్ టాప్ ప్రింటెడ్ లెహంగా ఫర్ ఫెక్ట్ కాంబినేషన్ అంటారు డిజైనర్స్. ఎంబ్రాయిడరీ మెరుపులు జోడించి ప్యాచ్ లు జతచేసి పువ్వులతో నింపి చక్కటి ప్రింట్లు సమకూర్చి లెహంగా కు కొత్త హంగులు తీరుస్తున్నారు డిజైనర్స్. పూర్తిగా ఎంబ్రాయిడరీ తోనూ వెస్ట్రన్ పెప్లమ్ టాప్ తో జత చేస్తే వేడుకల్లో చక్కని లుక్ ఇస్తుంది. అలాగే అందమైన పువ్వుల్ని లెహంగా డ్రెస్ మీదకు చేర్చి డిజైన్ చేసిన లెహంగా పార్టీ వేడుకల్లో మెరిసిపోతోంది సాంప్రదాయ వేడుకల్లోనూ, వెస్ట్రన్ లుక్ లోనూ లెహంగా ఎప్పుడూ లేటెస్ట్ ఫ్యాషనే.

Leave a comment