Categories
చాలా మంది నిద్ర లేస్తూనే మంచం దిగకుండా బద్దకంగా పడుకొంటారని అలా చేయడం ఆరోగ్యపరంగా మంచిది కాదంటారు వైద్యులు. నిద్ర లేచీ లేవగానే కళ్ళు, చేతులు సాగదీసే స్ట్రచ్చింగ్ వ్యాయామాలు చేస్తే శరీరం ఉత్సాహంతో వుంటుందంటున్నారు. అలాగే ఎన్ని గంటలు నిద్ర పోవాలన్నదిముందే నిర్ణయించుకుంటే, అలారం మోగగానే లేవాలని అనిపిస్తుందని లేకపోతె అస్తమానం అలా మోగడం, ఆపడం చాలా ఇబ్బందిగా ఉంటుంన్నారు. లేవగానే చేతుల్లోని ఫోన్ తీసుకోవడం, ఫేస్బుక్ మెసేజ్ లు చూడవద్దని కాసేపు బయటి వాతావరణంలో ప్రశాంతంగా పచ్చని చెట్లని మొక్కల్ని చూడటం ఏదైనా సంగీతం వినడం మంచి దంటున్నారు.