నాతోనే నాకు పోటీ అంటుంది రకుల్ ప్రీత్ సింగ్ .ప్రేక్షకుల ధోరణి మారింది. ఎప్పుడూ ఏదో కొత్తదనం కావాలను కొంటారు. అందుకే నాకు పాత్రల పరంగా ప్రయోగాలు చేయాలని ఉంటుంది. ఈ రోజు కొత్తగా చేయాలి అన్న ఫీలింగ్ తో సెట్ కి వెళ్లాలనుకుంటాను. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలని నాకు తపన గా ఉంటుంది అంటుంది రకుల్. అర్జున్ కపూర్ తో సర్దార్ కా గ్రాండ్ సన్ లో దక్షిణాది అమ్మాయి పాత్ర, ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జి తో గైనకాలజిస్ట్ పాత్ర థ్యాంక్ గాడ్ లో ఒక ప్రత్యేకమైన పాత్ర వైష్ణవ్ తేజ్ తో చేసే సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్ర ఇవన్నీ సరికొత్త ప్రయోగాలు ఇవన్నీ నాకు ఎంతో సంతృప్తి ఇచ్చాయి అంటుంది రకుల్ ప్రీత్ సింగ్.