గుంటూరు కు చెందిన బొమ్మిని మౌనిక అక్షయ స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్‌ చెస్‌ ఫెస్టివల్‌లో 3వ విమ్‌ నార్మ్‌ సాధించటం ద్వారా ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ అయింది. కోనేరు హంపి నాకు స్ఫూర్తి అంటుంది మౌనిక అండర్‌–7 నుంచి అండర్‌–20 వరకు రాష్ట్ర స్థాయిలో అన్ని విభాగాల్లోనూ విజేతగా నిలిచాను. మూడుసార్లు సీనియర్‌ ఉమెన్స్‌లోనూ టైటిల్‌ సాధించాను. 2019లో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్‌  ఓపెన్‌లో తొలి విమ్‌ నార్మ్, 2021 హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఓపెన్‌లో రెండో విమ్‌ నార్మ్ సాదించ గలిగాను తప్పని సరిగా గ్రాండ్ మాస్టర్ హోదా సాధిస్తాను అంటుంది మౌనిక అక్షయ.

Leave a comment