మనిషి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఆ కారణంగానే మన శరీరంలో ప్రవేశించిన ఏ రోగ క్రిమినైనా శరీరం వెంటనే నాశనం చేయ గలుగుతుంది. ప్రస్తుత కరోనా ప్రమాద సమయంలో రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేసే ఆహారం తప్పనిసరిగా తీసుకోమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన సాంప్రదాయ వంటల విధానంలోఎన్నో రకాల మూలికలు కలగలసి ఉంటాయి. పసుపు,మిరియాలు,అల్లం,కొత్తిమీర,పుదీనా,దాల్చిన చెక్క,మిరపకాయలు మొదలైనవి వాడే అలవాటు అందరికి ఉంది. దగ్గు,జలుబు,జ్వరము దగ్గరికి రాకుండా ఈ వస్తువులు అన్ని వాడి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటే ఎలాటి వైరస్ లు దగ్గరకు రాకుండా ఉంటాయి. పుష్టికరమైన పోషకాలతో కూడిన,వేడిగా ఉన్న భోజనం రోగనిరోధక వ్యవస్థని చక్కగా కాపాడుతుంది. ఆరోగ్యాంగా ఉండేందుకు సాంప్రదాయ వంటకాలే తింటే మంచిది.

Leave a comment