Categories
రైతులకు మహిళలకు ఆదర్శంగా నిలిచిన రేణు సాంగ్వాన్ జాతీయ గోపాల్ రత్న పురస్కారం 2024 అందుకున్నది హర్యానా రాష్ట్రం ఝజ్జర్ జిల్లాలోని ఖర్మాన్ గ్రామానికి చెందిన రేణు పాడి పరిశ్రమలో ఆమె చేసిన సేవలకు గాను కృషి జాగరణ్ మిలీనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డ్ కూడా అందుకున్నది. 280 పాడి ఆవులతో మూడు కోట్ల టర్నోవర్ తో ఆమె సొంతమైన గోకుల్ ఫామ్ శ్రీకృష్ణ అత్యుత్తమమైన ఫామ్ లలో ఒకటి ఈ ఫామ్ తయారు చేసే నెయ్యికి 24 దేశాల్లో డిమాండ్ ఉంది. ఈ ఫార్మ్ లో ఆటోమేటిక్ మిల్కింగ్ యంత్రాలు, అధునాతన క్లీనింగ్ యంత్రాలున్నాయి. పాడి పరిశ్రమలు వ్యాక్సినేషన్,పరిశుభ్రత చాలా కీలకం అంటారు రేణు రేణు సాంగ్వాన్.