Categories
ముంబై లోని బేబీ గార్డెన్ ఆడవాళ్ళకు మాత్రమే ఇక్కడ ఉదయం సాయంత్రం తల్లులు పిల్లలతో గార్డెన్ కలకలలాడుతూ ఉంటుంది. వయసు మళ్ళిన వాళ్ళు శరీరాన్ని కదిలించేందుకు ఇబ్బంది ఉన్న చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇక్కడకు వచ్చే ఆడవాళ్ళు సోషల్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని స్నేహ సంబంధాల తో ఉంటారు. ముంబై ఢిల్లీ వంటి చోట్ల అపార్ట్మెంట్స్ లో ఉండే ఆడవాళ్లు బయటకు వచ్చి కాసేపు కాలక్షేపం చేసే ప్రదేశాలు ఉండవు. అన్నీ మగవాళ్లతో రద్దీగా ఉంటాయి. గత సంవత్సరం జరిగిన ఒక సర్వేలో నగరాల్లో మహిళలు పూర్తిగా ఒంటరితనానికి లోనవుతున్నారని తేలక వాళ్ల కోసం ఆ సమస్య పరిష్కారం కోసమే ఈ బేబీ గార్డెన్ మహిళలకు కేటాయించారు. ప్రతి ఊర్లో ఇలాంటి బేబీకి గార్డెన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది కదూ !