ఈ ఎండలకు కర్బూజ తినడం శ్రేష్టం అంటున్నారు డాక్టర్లు. గర్భిణి లలో అదనంగా చేరే సోడియం ను తొలగించడంలో కర్బూజ సహాయపడుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తుంది. వేసవిలో తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. కర్బూజా లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కర్బూజ జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. చర్మానికి మేలు చేస్తుంది. కంటికి   బలాన్ని ఇచ్చే విటమిన్ ఎ ఇందులో పుష్కలంగా ఉంటుంది. వేసవి ఆహారంలో తప్పని సరిగా చేర్చుకో దగ్గది ఈ కర్బూజ.

Leave a comment