సలాం- వాలే కుం-సలాం భాయ్ ఔర్ బెహనో
మరి రంజాన్ ముబారక్ చెప్పేసుకుని వంట షురూ….
ముస్లిం సోదరీ-సోదరులు పెద్ద ఎత్తున జరుపుకునే ఈద్.అందరు కలిసి- మెలిసి విందు-వినోదాల లో ఉత్సాహంగా పంచుకునే రంజాన్ పండుగ. పేద- గొప్ప అని భావించి మనమంతా ఒక్కటే అని గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు. 40 రోజులు ఎంతో నిష్ఠ గా ఉపవాసం ఉండి,క్రమం తప్పకుండా నమాజ్ చేస్తూ,ఎవరిని దూషించటం,దుర్భాషలాడటం
లేకుండా సంతోషం గా గడుపుతూ ఇష్టమైన వంటకాలు అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రంజాన్ పండుగ ని ఆహ్వానిస్తారు. వారి యొక్క పవిత్ర గ్రంధం “ఖురాన్ ” .
ఇష్టమైన రంగులు:ఆకుపచ్చ,రాణి రంగు.
ఇష్టమైన పూలు: రోజా,మల్లె
ఇష్టమైన అభిరుచులు: సెంటు,గోరింటాకు.
బురఖాని తప్పనిసరిగా ధరించాలి.
రంజాన్ స్పెషల్: షీర్ ఖుర్మా
తయారీ విధానం: చిక్కటి పాలు, సన్నని సేమియా, పంచదార, ఎండు ఖర్జురాలు,బాదం పప్పులు, జీడి పప్పు,కిస్మిస్ముందు గా పాలు మరిగించి అందులో తీసుకున్న పదార్థాలు అన్ని వేసి ఉడికించితే వేడి వేడి షీర్ ఖుర్మా పరోస్ నే కే లియే తయార్ హో గయా హుజూర్!!
“రంజాన్ ముబారక్”.
-తోలేటి వెంకట శిరీష.