1831 మార్చి 10వ తేదీన జన్మించారు సావిత్రిబాయి ఫూలే .  భారతీయ సంఘ సంస్కర్త,  ఉపాధ్యాయిని మరియు రచయిత్రి. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.  కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సర్వహక్కుల కోసం పోరాటం చేశారు.  పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిన భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు.  సంఘ సంస్కర్తగానే కాదు రచయిత్రిగా ఆమె వేగు చుక్కగా నిలిచారు. సావిత్రిబాయి జయంతిని భారతదేశ మహిళ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకొంటున్నాము.

Leave a comment