1869 ఏప్రిల్11వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు కస్తూరీబా. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భార్య. రాజకీయ నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు కస్తూరిబా.  దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యోగుల పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగిన ఉధ్యమంలో కస్తూరిబా అరెస్ట్ అయ్యారు. క్విట్ ఇండియా మూమెంట్ అరెస్టుల ద్వారానూ సబర్మాతి అశ్రమంలోని కఠినమైన జీవనం మూలంగాను ఆమె జబ్బుపడి  కోలుకోలేకపోయారు.  గాంధీజీ సిద్దాంతాలకు అనుగుణంగా నడుచుకున్నారు ఆమె. ఆయనకు నీడగా మెలగటం ఆమెను విశిష్ట మహిళగా మలిచింది.

Leave a comment