అంత్య నిష్టురము కన్నా అది నిష్టురము మేలు !
అందని మామిడిపండ్లు పుల్లన !
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడ్డట్టు !
అందులో పస లేదు గంజిలో వార్చమన్నట్లు !
అక్క మనదైతే బావ మనవాడవుతాడా !
అగ్ని కి వాయువు తోడు అన్నట్లు !
ఇలాటి సామెతల్లో ఎన్నో జీవిత సత్యాలు కనిపిస్తాయి అగ్నికి వాయువు తోడు అంటే ఇద్దరు తగవులు పడుతూ ఉంటే మధ్యలో వాళ్ళు సర్ది చెప్పకుండా ఇంకో రెండు మాటలు చెప్పి ఆ తగవును పెద్దది చేస్తు ఉంటే ఈ సామెత వాడుతారు. అసలే అగ్ని మండుతోంది దానికి ఇంకాస్త గాలి తోడైతే లోకాన్నే దహించి వేస్తుంది కదా ! అలా ఉంటుంది ఈ వ్యవహారం అని అర్ధం.
సి.సుజాత