నీహారికా,
ఇవ్వాల్టి రోజుల్లో చాలా మంది స్త్రీలు ఉద్యోగాల్లో ఉన్నారు. కాణీ చాలా కొద్ది కాలం పని చేసాక, ఇటు ఇంటిపని, జాబ్ రెండు బర్డెన్ గా ఫీలవ్వుతూ వుంటారు కానీ వాళ్ళకు బోర్ కొట్టేది పనుక భారం కాదు, ఇంకే రంగం లోనూఅడుగు పెట్టకుండా, కేవలం రెండు పనుల తోనే సరిపెట్టుకోవడం వల్ల అలా చిరాకు వస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. మరి ఈ రెండూ కాక ఇంకేం రంగం అంటే మనసుకి ఇష్టమైన పని. జీవితంలో ఎదిగేందుకు , కుటుంబం వృద్దిలోకి వచ్చేందుకు, కుటుంబ వృద్దిలోకి వచ్చేందుకు కష్టపడటం మంచిదే కానీ ఆ వత్తిడి తో మనస్సుకి నచ్చే ఏ చిన్నపాటి పనికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల రోటీన్ గా పనులు చేసుకోకపోవటాన్ని భరించ లేకపోతున్నారంటున్నారు. ఫ్రెండ్స్, బంధువుల్ని కలుసుకోవడం, చదువుకోవడం, ఏ పాటలో వినేందుకు ఓ అరగంట కేటాయించటం చివరకు ఏ ముగ్గులో, కుట్లో, అల్లికలో ఎదో ఒక పనిలో నిమగ్నం అయిటే తప్పించి నిత్యం చేసే జాబ్, ఇంటి పని తప్పనిసరిగా విసుగు తెప్పిస్తాయని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. కెరీర్ కోసం చక్కగా పనిచేసుకోండి, మనస్సునిండటం కోసం ఎదో ఒక నచ్చిన పని కుడా చేయండి అంటున్నారు.