Categories
విందులు,పార్టీలు పండుగ సందర్భాల్లో కళ్ళకు ఎదురుగా నచ్చిన పదార్ధాలు కనిపిస్తూ కంటికి ఇంపుగా ఉంటాయి. అలాగే బరువు పెరుగుతామనే భయంతో నోరు కట్టేసుకుని ఉంటారు కదా చేయి అటువైపు లాగుతుంది.ఒక్క రోజే కదా అని ఎక్కువ తినేసిన జీర్ణక్రియ దెబ్బతిన్నట్లే.అందుకే అలాంటి సందర్భాల్లో సంయమనం పాటించాలి.మొలకలు,పండ్ల ముక్కలు ,సలాడ్ ఉన్న ప్రాంతంలోనే కాలక్షేపం చేయాలి. అలాగే ఒకసారి పెద్ద పళ్ళెం నిండా పెట్టుకుంటే తినకుండా కంట్రోల్ చేసుకోవడం అనుమానమే. అసలు అలా కనిపించిన వాటితో ప్లేట్ నింపోద్దు. ఫ్రూట్ జ్యూస్ వైపు వెళ్ళోద్దు. అలాగే పంచదార వేసిన జ్యూస్ లు వద్దు. పండ్ల ముక్కలు తేలికైన ఆహారం మాత్రమే అని మనసుకి నచ్చచెప్పుకోకపోతే కడుపుబ్బరం ఖాయం.