గద్వాల్ ,కంచిపట్టు,ధర్మవరం అన్ని రకాల వస్త్ర శ్రేణులలో పరికిణిలు ప్రత్యేకంగా వస్తున్నాయి. భారీ అంచుతో బంగారు పూల డిజైన్లతో ప్రత్యేకమైన రంగులతో పరికిణిలు పండుగకు అందం. అలాగే పుట్టిన రోజు చిన్నప్పటి ఫంక్షన్లలో కూడా పట్టు పావడా చక్కగా ఉంటుంది. గాఢమైన నీలిరంగు రత్నావళి రంగు పరికిణి ,చిలక పచ్చ రంగుతో పట్టు పరికిణి కొన్ని ప్రత్యేకంగా నేస్తారు. ఇప్పుడు ఆధునికమైన లుక్ కోసం మెటఫ్ మెరుపులు ,గళ్ళ డిజైన్లు, మామిడి పిందెలు,నెమళ్ళ అంచులతో అమ్మాయిలు పట్టుపావడల్లో మెరిసిపోతారు నగల డిజైన్ జాకెట్ వేసుకుంటే వేరే ఆభరణాలు అవసరం లేదు. పండుగకి పట్టు పరికిణీల కోసం ఓసారి చూడోచ్చు.

Leave a comment