తలస్నానానికి కుంకుడు కాయలు వాడకం ఏనాడో దూరం చేశారు. కానీ ఈ కుంకుడు రసం జుట్టుకే కాదు ఖరీదైనా పట్టు ,నేత చీరెలనూ మిలమిల మేరిసేట్టు చేస్తాయి. ఈ రసంతో ఉతికితే రంగు పోదు , కొత్త దనం కూడా మాసిపోదు. అలాగే కుంకుడు రసంతో వెనిగర్ కలిపి గాజు సామాన్లు, కిటికీల అద్దాలు తుడిస్తే మిలమిల మెరుస్తాయి. స్నానాల గదిలో కుంకుడు రసంతో బేకింగ్ సోడా, ఓ స్పూన్ బొరాక్స్ పౌడర్ కలిపి బాత్ రూమ్ గోడలకు , నేలపైన రాసి కడిగేస్తే క్లీన్ గా అవుతాయి. ఈ రసంలో ఎసెన్సియల్ ఆయిల్ ఏదైనా కలిపి గోడలపై దారగా చల్లితే దోమలు, ఈగలు రావు.

Leave a comment