ఇమ్యూనిటీ పెంచే జ్యూస్ లు తీసుకోమంటున్నారు పోషకాహార నిపుణులు.ఆపిల్ బీట్ రూట్ క్యారెట్ మిశ్రమాన్ని ఏ బి సీ  డిటాక్స్ డ్రింక్ అంటారు.ఈ మూడింటి మిశ్రమం లివర్ కిడ్నీలకు మేలు చేస్తుంది బీట్ రూట్ లో ఉండే విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆపిల్ లో ఉండే విటమిన్ బి1, బి2, ఫోలేట్, నియాసిన్, జింక్, కాపర్, పొటాషియం వంటివి నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అలాగే క్యారెట్ లోని పోషకాలు పీచు బీటాకెరోటిన్ వంటివి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ జ్యూస్ లు తప్పకుండా తీసుకుంటూ ఉండాలని చెబుతున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment