ఈ మధ్య సినిమాల్లో కూడా లెనిన్ అందాలు కనిపిస్తున్నాయి. కాటన్స్ అంత మెరిసిపోవు గాని డిజైనర్ చీరెలకు లెనిన్ కాటన్ చక్కగా అమరికగా ఉంటున్నాయి.కానీ సాయంత్రం వరకు నలిగిపోకుండా ఫ్రెష్ గా కనిపించాలి. అంటే ఫ్యాన్సీ డిజిటల్ ప్రింటింగ్ లెనిన్ చీరెల వైపు వెళ్ళాలి. చీరె తేలిగ్గా ఉంటుంది డిజిటల ప్రింట్లతో సరికొత్త ఫ్యాషన్ గా కూడా ఉంటుంది.లెనిన్ ఫ్యాన్సీ చీరెల పైన ఇంకో ప్రత్యేకత మొఘల్ డిజైన్స్ చాలా బావుంటాయి. పొడవాటి పైట కొంగు మొత్తం కనుచెదిరే రంగులతో పెయింటింగ్స్ వేసినట్లు ఉన్నాయి. అలాగే లెనిన్ ఫ్యాన్సీ చీరెలకు పెద్ద పూల ప్రింట్స్ ప్రత్యేకమైన అందం. గిలాబీలు కమలాలు సహజమైన రంగులతో చీరె మొత్తం పరిచినట్లే ఉంటున్నాయి.ఇక చీరె మొత్తంగా డిజిటల్ ప్రింట్స్ అయితే మోడ్రన్ గా ఉన్నాయి.

Leave a comment