Categories
రెండు మూడేళ్ళ పిల్లలకు వారి లోని భావోధ్వేగాలను నిర్వహించుకోగల సామార్ధ్యాన్ని పెంచుకొనేలా చేయలంటే పుస్తకాలు ఒక్కటే మార్గం అంటున్నారు . కోపం ,భయం ,బాధ,ఆతృత ఇలాంటి క్లిష్టమైన ఎమోషన్ లను నియంత్రించుకోవటం గురించి పుస్తకాలు చదివి వినిపిస్తూ అందులో పాత్ర ప్రవర్తన గురించి వివరంగా చెప్పాలి. స్నేహాల విలువ ,సానూభూతి దోరణులకు ఇక్కడే బీజం పడుతుంది. ఒక మంచి పని చేసేందుకు ఎంత కష్టపడతారు,ఆ కష్టం విలువ పిల్లలు తెలుసుకోవాలంటే పుస్తకం ఒక్కటే మార్గం క్షమించటం ఇవ్వటం ప్రేవించటం కలిసి పంచుకోవటం వంటి మంచి లక్షణాలు పిల్లల బుర్రల్లోకి వెళ్ళాలి. ఆ ప్రయాణం వాళ్ళకి నచ్చాలి. అప్పుడే వాళ్ళు మంచి పౌరులవుతారు.