అందానికి రూపం కట్టినట్లు కనిపించే మందారపూల చర్మం జుట్టు కి తగిన పోషణ ఇస్తాయి జుట్టు రాలిపోతుంటే మందార పూలు ఎండ బెట్టి పొడి చేసి కొబ్బరి నూనె మూడు వంతులు పావు వంతు ఆముదం కొన్ని మెంతులు కలిసి మందారపూలు పొడి కలిసి , మందార పువ్వుల పొడి కలిపి మరగనివ్వాలి. ఇది సగం అయ్యే దాకా మరిగాక ఈ నూనె ను ఆరబెట్టి సీసాలో పోసుకుని ప్రతిరోజు రాసుకోవాలి ఇలా చేస్తే ఊడిన జుట్టు తిరిగి వస్తుంది .మందార పూలు వేసి మరిగించి నీళ్లలో రెండు చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి తలస్నానం చేస్తే వీటిలోని సుగుణాలు చర్మాన్ని తాజాగా చేస్తాయి.మందార ఆకులు మెత్తగా నూరి ఇందులో కలబంద రసం ఆలివ్ నూనె కలిపి తలకు ప్యాక్ లా వేసుకొని అరగంట ఆరిపోయాక తలస్నానం చేయాలి ఇలా చేస్తే జుట్టుకు పోషణ అంది ఆరోగ్యంగా మారుతుంది.
Categories