ఎవరికైనా డబ్బు దానం చేయటం తేలిక కానీ శారీరక శ్రమ దానం దానంత తేలిక కాదు. మనం మనిషికీ మనిషికీ మధ్య తేడాలు చూస్తారు. కానీ దేవుని దృష్టిలో మనమంతా సమానం అంటారు రచయిత్రి ఇన్ఫోసిస్ ఫౌండేషన్  చైర్ పర్సన్ సుధా మూర్తి. ఆమె సంపద విలువ 2480 కోట్లు. సంవత్సరంలో మూడు రోజులు బెంగళూరు లోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో సేవ చేస్తారామె. వంటగదిలో సహాయం. కూరగాయలు కోయడం. ఆవరణ ఊడ్చటం చెత్త బుట్టలు ఖాళీ చేయటం వంటి పనులు చేస్తారు. ఫోటోలో కనిపించే కూరలమ్మే దృశ్యం కూడా సుధామూర్తి చేసే సేవలో భాగమే.

Leave a comment