చెన్నై లోని మైలాపూర్ లో ఉంది కపాలీశ్వర గుడి చాలా అందమైంది పార్వతీదేవి ఇక్కడ కార్పగాంబాల్ గా పూజలందుకుంటోంది. ఆదిశక్తి నెమలి రూపంలో శివుణ్ణి ఆరాధించిన ప్రదేశంగా చెపుతారు. కార్పగాంబాల్ పేరుతోనే కోర్కెలు తీర్చే కల్ప వృక్షం అన్న అర్థం ఉంది. ఈ దేవాలయానికి తూర్పు పడమర దిశలో ఒక రెండు గోపురాలున్నాయి తూర్పు గోపురం ఎత్తు 40 మీటర్లు పశ్చిమ గోపురం కాస్త తక్కువ ఎత్తు ఈ గోపురం పైన ఉండే శిల్పకళా ఒక అద్భుతం పలు దేవతామూర్తులు ఎన్నో పౌరాణిక ఘట్టాలు కలిసిన గోపురం రంగులు చాలా దూరం నుంచి కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

Leave a comment