విశ్రాంతి అంటే నిద్ర పోవటం అనుకుంటే పొరపాటు అంటున్నాయి తాజా పరిశోధనలు.విశ్రాంతిగా కూర్చోని అలసట శరీరంలో ఉందని గ్రహిస్తూ దాన్నితీర్చుకోవటం కోసం తీసుకొనే సమయం విశ్రాంతి సమయం అంటున్నారు. ఇలాంటి విశ్రాంతి శరీరానికీ ,మనసుకీ తగిన శక్తిని ఇస్తుంది.దీన్నీ ప్రతిరోజు ఇవ్వాలి రోజంతా విపరీతమైన వేగంతో ఒక దాని వెంట ఒకటి చేస్తుండే పనులు,ఆఫీస్ లోని పని టెలివిజన్ చూడటం ,కంప్యూటర్ ముందు కూర్చోని గంటల తరబడి వర్క్ ఇవన్ని మానసిక ,శారీరకమైన అలసట ఇస్తాయి. అప్పుడు ప్రశాంతంగా పది నిమిషాలు విశ్రాంతిగా ఆరుబయట పచ్చని చెట్లు చూస్తూ ,లేదా కళ్ళు మూసుకొని విశ్రాంతి అనుభవిస్తూ గడపాలి.అప్పుడే మనసుకీ శరీరానికీ విశ్రాంతి అంటున్నాయి పరిశోధనలు.

Leave a comment