తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మందికి పద్మ పురస్కారాలు లభించాయి. వివిధ రంగాల్లో సేవలందించిన మొత్తం 89 మందిని ప్రభుత్వం ఈ పురస్కారాలతో సత్కరించనుంది. విజయవాడ కేంద్రంగా విద్యా సంస్థ స్థాపించి ఆ సంస్థల పేరునే ఇంటి పేరుగా మార్చుకొన్న వేగి కోటేశ్వరమ్మ గారు ఆరు దశాబ్దాలుగా విద్యావనం లోనే అడుగులు వేస్తున్నారు. కృష్ణా జిల్లా గోసాల గ్రామంలో 1925 లో జన్మించారు. కాకినాడ, గుంటూరు లలో కళాశాల చదువును పూర్తిచేసి ఉపాధ్యాయ వృత్తి లోకి రావడానికి శిక్షణ తీసుకొన్నారు. నెల్లూరు, విజయవాడల్లో కొంతకాలం పనిచేశారు. చదువు విషయంలో లింగ వివక్షను చూసి చలించిపోయి 1955 లో పది మంది పిల్లలతో మాంటిస్సొరి పేరుతో పాఠశాల ను స్థాపించారు. విద్యారంగం లో ఆమె చేసిన కృషికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది.
Categories
Gagana

చదువుల తల్లి కోటేశ్వరమ్మ గారు

Leave a comment