Categories
చాలా మంది ప్రతి చిన్న విషయానికి ఎంతో ఆందోళన పడతారు ఆ వత్తిడిలో డిప్రెషన్ కు గురవుతారు కూడా ఇలాటి మానసిక సమస్యకు కౌన్సిలింగ్ ,మందులు వాడటం తప్పనిసరి . వీటిలో వ్యాధి లక్షణాలు తగ్గుతాయి కానీ వ్యాధిని పూర్తిగా తీసేయలేకపోతారు. అయితే ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో మెదడు భాగంలో న్యూరో ట్రోఫీని-3 అనే రసాయనం శాతం పెరిగినపుడు ఆందోళన తగ్గినట్లు గుర్తించారు. ఈ అధ్యయనంలో మానసిక సమస్యని తగ్గించ గలిగే ఇంకొన్ని పదార్దాలు కూడా ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధన ఇంకాస్త ముందుకు వెళ్ళి ఈ పదార్దాలన్నింటిని గుర్తించ గలిగితే మానసిక సమస్యలను పూర్తిగా నివారించవచ్చు నంటున్నారు.